“ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకం విడుదలై దాదాపు అయిదేళ్లు కావొస్తోంది. ఇప్పటికి తొమ్మిది సార్లు పునర్ముద్రణ పొంది అమిత ప్రజాదరణ పొందిన ఈ అనువాద పుస్తక కథ గత వారం ఒక కొత్త రూపు తీసుకుంది.
తెలుగు యూనివర్సిటీలో ఎం.ఫిల్ చేస్తున్న రఘువీర్ వగ్గు ఈ పుస్తక కథ ఆధారంగా ఒక నాటకం రూపొందించారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకుని 26 మార్చి నాడు తెలుగు యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో భాగంగా యూనివర్సిటీ విద్యార్ధులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ నాటక ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నాటక రంగ కళాకారులు శ్రీ చాట్ల శ్రీ రాములు గారు మాట్లాడుతూ ఒక దళారీ పశ్చాత్తాపం తనకు అత్యంత ఇష్టమైన పుస్తకమని. తాను స్వయంగా అనేక కాపీలు కొని తన మిత్రులకు పంచానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీ దుగ్గిరాల సోమేశ్వర రావు గారు, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ భట్టు రమేశ్ గారు కూడా పాల్గొన్నారు.
నాటకంలో జాన్ పెర్కిన్స్ పాత్రను పోషించిన తిరుపతి రెడ్డి ఆ పాత్రలో జీవించాడు. ఇతర పాత్రల్లో నటించిన నటీ నటులు కూడా చక్క గా నటించారు.
–
ఆ ప్రదర్శన తాలూకు పత్రికా కధనాలు కింద చూడొచ్చు.
ఈనాడు దినపత్రిక

–
ఆంధ్రజ్యోతి దినపత్రిక

–
వార్త దినపత్రిక

మార్చి 31, 2011 at 11:11 పూర్వాహ్నం
wow…….
మార్చి 31, 2011 at 2:43 అపరాహ్నం
Congratulations Dileep !
ఏప్రియల్ 1, 2011 at 4:37 పూర్వాహ్నం
మంచివార్త. పుస్తకం జనంలోకి సూటిగా వెళ్లింది. ఎన్నో విషయాలు తెలియజెప్పింది. నాటకంగా ఇప్పుడు మరింతగా ప్రజాశ్రేణుల్లోకి వెళ్లి ఒక గొప్ప ఆలోచనను చర్చకు పెడుతుంది. మరి నాటకాన్ని ఎప్పుడు పుస్తక రూపంలో ప్రచురిస్తున్నారు? కనీసం లిమిటెడ్ ఎడిషన్ గా నైనా వేస్తే, ఆయా నాటక రంగ ప్రముఖులు తమ వేదిక, నటులకు అనుగుణంగా స్వల్ప మార్పులతో ప్రదర్శనకు ఉపయోగకరంగా వుంటుంది. రఘువీర్ కు ప్రత్యేకంగా అభినందనలు. శుభాకాంక్షలు.